Posts

Showing posts from October, 2020

Telugu Padam- Life Of Ram (2)

Image
 తెలుగు పదం (2) లైఫ్ అఫ్ రామ్  తెలుగు పదాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో కొనసాగుతున్న నా అభిలాష మీ ఉత్సాహం ఎప్పటికి మరువలేనివి. మార్పు అన్నది చాలా పెద్దది అది రావాలి అంటే దాన్ని తీసుకొచ్చేవారు దాన్ని ప్రోత్సాహించేవారు ఇద్దరు ప్రముఖులే. ఐతే ఆ మార్పును అలాగే నూతనంగా ఆహ్వానిస్తూ మన ఈ ధారావాహికను ఎప్పటిలాగానే కొనసాగిద్దాం.  గత సంచికలో మహామహుల గూర్చి చేర్చించుకున్నాం విశ్లేషించుకున్నాం, ఆ కవిసార్వభౌమా "అన్నమాచార్యుల" వారి గూర్చి, పరోపదించిన గానగంధర్వులు "బాలు" గారి గూర్చి వారి కలయికలో చెయ్యబడ్డ కృతి- అలసితి సొలసితి గూర్చి విశ్లేషణ జరిగింది. ఐతే ఈ సంచికలో దేని గూర్చి విశ్లేషిస్తామో మీకు ఈ పాటికే అర్థమయ్యివుంటుంది. ఈరోజు సినీ సంగీత ప్రపంచానికి దొరికిన మాణిక్యం "సిరివెన్నెల సీతారామ శాస్త్రీ"గారు ఇటీవలే "జాను" అనే చిత్రానికి రాసిన "లైఫ్ అఫ్ రామ్" అను పాట  గూర్చి మాట్లాడుకుందాం.  చిత్రం: జాను- 2019 సంగీతం: గోవిందా వసంత  గానం: ప్రదీప్ కుమార్  సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రీ  Movie: Jaanu- 2019 Music: Govinda Vasantha Singer: Pradeep Kum