Telugu Padam- Life Of Ram (2)
తెలుగు పదం (2)
లైఫ్ అఫ్ రామ్
తెలుగు పదాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో కొనసాగుతున్న నా అభిలాష మీ ఉత్సాహం ఎప్పటికి మరువలేనివి. మార్పు అన్నది చాలా పెద్దది అది రావాలి అంటే దాన్ని తీసుకొచ్చేవారు దాన్ని ప్రోత్సాహించేవారు ఇద్దరు ప్రముఖులే. ఐతే ఆ మార్పును అలాగే నూతనంగా ఆహ్వానిస్తూ మన ఈ ధారావాహికను ఎప్పటిలాగానే కొనసాగిద్దాం.
గత సంచికలో మహామహుల గూర్చి చేర్చించుకున్నాం విశ్లేషించుకున్నాం, ఆ కవిసార్వభౌమా "అన్నమాచార్యుల" వారి గూర్చి, పరోపదించిన గానగంధర్వులు "బాలు" గారి గూర్చి వారి కలయికలో చెయ్యబడ్డ కృతి- అలసితి సొలసితి గూర్చి విశ్లేషణ జరిగింది. ఐతే ఈ సంచికలో దేని గూర్చి విశ్లేషిస్తామో మీకు ఈ పాటికే అర్థమయ్యివుంటుంది. ఈరోజు సినీ సంగీత ప్రపంచానికి దొరికిన మాణిక్యం "సిరివెన్నెల సీతారామ శాస్త్రీ"గారు ఇటీవలే "జాను" అనే చిత్రానికి రాసిన "లైఫ్ అఫ్ రామ్" అను పాట గూర్చి మాట్లాడుకుందాం.
చిత్రం: జాను- 2019
సంగీతం: గోవిందా వసంత
గానం: ప్రదీప్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రీ
Movie: Jaanu- 2019
Music: Govinda Vasantha
Singer: Pradeep Kumar
Lyrics: Sirivennala Seetharamasastry
ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చినట్టే శాస్త్రీ గారు సంగీత ప్రపంచానికే మకుటాయమానంగా చెప్పుకోదగిన పేరు. ఆయన ఏ పాట రాసిన అది అద్భుతం, అమోఘం. ఎం మాయ చేస్తారో తెలీదు ప్రతి అక్షరం గుండెకు తాకుతుంది అది సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది . అంత గొప్ప సాహితీ విలువలు ఉన్న ఇటు వంటి మాహానుభావులు మన పరిశ్రమలో ఉండడటం మనం చేసుకున్న అదృష్టం.
ఐతే ఇప్పుడు ఈ పాట లో ఆయన చేసిన చమత్కారం చూదాం.
పల్లవి:
|| ఏ దారి ఎదురైనా ఎటువెళుతుందో అడిగానా ?
ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న |
ఎం చూస్తూ ఉన్న నే వెతికానా ఎదైన ?
ఉరికెనే చొట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న ||
కొసమెరుపు: ఇక్కడ చిత్రంలో నాయకుడు ఒక సంచారి , తాను ఒంటరిగా ఉన్నప్పటికీ తానూ జీవితాన్ని అనుభవిస్తున్నాడు అన్నది అసలు అర్ధం . ఐతే ఆ నాయకుడి తత్వాన్ని వైఖరిని ఎంత అద్భుతంగా వర్ణించారో శాస్త్రీ గారు చెప్పటానికి వీలు లేదు!!
అసలు అర్ధం: చెప్పినట్టుగా చిత్రంలో నాయకుడు ఒక సంచారి , ఐతే తన మనసులో మాట ఈ పల్లవి - "తను ఎటు వెళుతున్న ఏ దారిలో పోతున్న ఎన్నడూ ఎక్కడికి ఎప్పుడు ఎలా అని తనకు తానె ప్రశ్నించుకోలేదట , ఒక నిలకడ లేని పరుగై పయనిస్తున్నాడట. తన చుట్టూ ఎన్నో ఏవో కనిపిస్తూనే ఉన్నాయి కానీ ఎన్నడూ అది ఏంటి అని తెలుసుకోవాలి అన్న కుతూహలం తనలో కలగలేదట !!"
Translation: In the film, the protagonist is a wanderer, so this song is an answer to all the questions arising in his heart. The actor is speaking with himself: "I have been on the wing reaching places, but not even a single day I have questioned myself where A'm I going or what I wanna look at!! I have been staring at so many things around me, but I never questioned myself again- Why A'm I seeing all these or not even I asked myself what are they?"
అనుపల్లవి:
|| కదలని ఓ శిలనే ఐన |
తృటిలో కరిగే కలనే ఐన |
ఎం తేడా ఉందట నువ్వేరంటూ అడిగితే నిన్నెవరైనా ?
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నయ్యి ఉంటానంటున్న |
ఎదో ఒక బడులై నన్ను చేరేపొద్దు అని కాలాన్ని అడుగుతున్నా |
నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనొద్దు అనవద్దు దయుంచి ఎవరు |
ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు |
నా ఊపిరిని ఇన్నాళ్లుగా వెన్నంటి నడిపిన చేయూత ఎవరిదీ ?
నా ఎదలయను కుశలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమలెవరివి ?
అసలు అర్ధం: "నేను కదలలేని ఓ శిలనే కావొచ్చు , ఒక క్షణంలో కరిగిపోయే కలనే కావొచ్చు ఐతే మాత్రం ఎం విత్యాసం ఉంటుంది నన్ను నువ్వు ఎవరు అని అడిగితే ? ఇలా ఎన్నో ప్రశ్నలాగానే నా బ్రతుకుని మిగల్చని దాన్ని ఒక సమాధానం చేసి నన్ను చేరేపొద్దు అని కాలాన్ని అడుగుతున్నా . నేను ఒంటరినే ఐతే మాత్రం నా వెంట పడి నువ్వు ఒంటరి అని హేళన చేయోద్దు ఎందుకంటే నేను సంచరించి ఎన్ని వేల అనుభవాలు స్మృతులను నా గుండెలో దాచుకున్నానో మీకు తెలీదు . నేను ఒంటరినే అయితే నా ఊపిరిని ఎల్లప్పుడూ కాపాడిన ఆ సహాయం ఎవరిదీ ? నా కుశల క్షేమ సమాచారం అడిగిన ఆ పరిమళాల గొప్పతనం ఎవరిదీ?"
Translation: " I might be a statue which cannot move, I might be a dream which just glides along with the time in seconds, but there cannot be a difference when someone asks- 'Who A'm I?' My persona might be a combination of many questions, but A'm requesting the fluttering seconds (time) to just not fade me out with an answer! I know A'm all alone, but please I request all of you- do not ask me why I am all alone, coz you may not really know about how many memories I have been piling in my heart since ages! Ok if that's fine, if A'm really all alone, then what's the force that's driving my life towards the destiny, who's that one who's asking my whereabouts? So, whom shall I credit for all the happiest fragrances that I have been always keeping a track of!!"
చరణం 1:
|| ఉదయం కాగానే తాజాగా పుడుతుంటా
కాలం ఇప్పుడే నన్ను కనగా |
అనగనగా అంటూనే ఉంటా
ఎప్పుడు పూర్తీ అవ్వనే అవ్వక, తుదిలేని కథనేనుగా|
గాలివాటం లాగ ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోట నిలకడగా|
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తోందో కేక మౌనంగా ||
కొసమెరుపు: బహుశా విజృంభించి రాయటం అంటే ఇదేనేమో. ఎన్ని సార్లు విన్న ఎన్ని సార్లు చదివిన ఆ అనుభూతి మొదటి సారి విన్నట్టే ఉంటుంది ఈ చరణంలో. ఐతే ఇక్కడ సంగీత దర్శకుడికి కూడా ప్రశంసలు అందాలి. మొదట కొంచెం వేరే బాణీ తో ఇదే పాట తమిళంలో చెయ్యడం జరిగింది, ఐతే ఆ సంగీత దర్శకుడు శాస్త్రి గారి పట్టు గూర్చి ఆలోచించి ఈ బాణీని ఇంతిలాగా మార్చేశాడేమో. అద్భుతం , ఆ బాణి అద్భతం . ఐతే గాయకుడు ప్రదీప్ కుమార్ ని కూడా ఎంత పొగిడినా తక్కువే, ఎం మహత్యం దాగి ఉందొ ఆ గళంలో ప్రతి మాట స్పటికమల్లే స్పష్టంగా వినిపించింది, ఆ తారాస్థాయి పాడినప్పుడు చెవిలో తేనే పోసినట్టే ఉంది. ఇంత గొప్పగా చెయ్య బడిన పాట అజరామరం!
అసలు అర్ధం: "ఏ రోజుకి ఆరోజు అప్పుడే పుట్టినట్టు ఈ కాలం నన్ను అమ్మలా కంటూనే ఉంటుంది! ఇప్పుడే పుట్టిన కూడా అనగనగా అంటూనే జీవిస్తా ఎందుకంటే నా కథకి అంతులేదు. గాలి కంటూ ఒక వాటం వ్యాఖరి ఉంటె, అది ఆగకుండా వెళ్లడం అంతేగా , కావున ఆ గాలిలాగా నా కాలు ఎక్కడ కూడా నిలకడగా నిలవదు. నాకంటూ ఒక ఇల్లు దానికి ఒక చిరునామా ఆలా ఎం లేవు . ఐతే మరి నా చిరునామా లేని ఇంటికి ఒక బదులే లేని లేఖ చేరి అరుస్తోంది మౌనంగా !!" ఎం చెప్పగలం ఇంతకన్నా- ఎక్కడన్నా కేక మౌనంగా ఉంటుందా? శాస్త్రి గారు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చెయ్యగలరు!
Translation: "My life takes new steps everyday, as long as this nature keeps bringing me up as her infant! I always keep concerning about the past, coz A'm an endless story! If at all wind has a trait, then it is to move tirelessly, then that is what A'm exactly! I don't have a home, I don't have an address, but I received a blank letter which is whooping silently!!!"
చరణం 2:
|| లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా ?
నేను నా నీడే ఇద్దరమే చాలు
రాకూడదు ఇంకెవరైనా |
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశెలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది|
జాబిల్లి అంత దూరానా ఉన్న, వెన్నెలగా చెంతనే ఉన్న
అంటూ ఊయలలూపింది జోలాలి ||
అసలుఅర్థం: " నా లోపల ఉన్న ఒంటరితనం నా చుట్టూ ఉన్న లోకం రెండు కూడా నాకే సొంతం, వినిపిస్తోందా ? నాకు నా నీడ నా నీడకు నేను ఇలా మేము ఇద్దరమే చాలు ఇంకెవ్వరు కూడా రావొద్దు ముందేచెబుతున్న . అమ్మ ఒడిలో మొన్నటి వరకు అసలు చేతికి అందని ఆశలేతో నిన్నటివరకు నన్ను ఊరిస్తుంది ఈ జాబిల్లి ఐతే కూడా వెన్నెలలా నా చెంతే ఉన్న అంటూ జోలాలి పాడింది కూడా ఆ జాబిల్లే !!"
Translation: " The seclusion inside & the world outside, both belong to me & only to me! A'm always happy, even if A'm lonely, I have my company that's my shadow & I'll request all of you to not ruin this companionship! In the past when I was a baby in my mother's lap & at present standing as myself with some unaccomplished goals, yet you just catch my eye- oh dear moon standing somewhere there in the sky. But you still sing a lullaby with the light that you omit, showcasing that you haven't gone too far!!"
Comments