Telugu Padam- Antharyaami (1)

తెలుగు పదం (1) అంతర్యామి అలసితి తెలుగు పదమ అన్న ఈ ధారావాహిక పూనుకున్నాక ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి అన్నది పెద్ద సమస్య నాకు. కానీ ఎప్పటినుంచో ఇలాంటిది ఏదైనా చేస్తే ఆ మహానుభావుడు నాకు ఎంతో ప్రీతిపాత్రమైన మనిషిలో దైవ రూపం - అన్నమాచర్య కీర్తనలతోనే మొదలు పెట్టాలి అన్నది ఒక వాంఛ. కావున ఈ మొట్ట మొదటి సంచిక ఆ మహానుభావుని పేరిట ఆయన ఎంతో భావోద్వేగంతో రాసిన "అంతర్యామి అలసితి " అన్న కీర్తన తో మొదలు పెడ్తున్నాం. అంతర్యామి అంటే ఇంతటి తో సమాప్తం అని కాదు ఇక్కడ్నుంచే అసలు కథ మొదలు గమనించగలరు!! ఐతే ఈ సంచిక కొనసాగించే ముందు ఒక చిన్న కొసమెరుపు: ఇటీవలే సంగీతాన్ని ఏలిన రారాజు అమృతం తాగారేమో అన్నంత తీయంగా ఉండే ఆ గళం మూగబోయింది మన భూలోకం విడిచి ఆ కైలాసం చేరుకున్నది - మీకు తెలుసు నేను ఎవరి గూర్చి చెప్తున్నానో- ఆ మహానుభావుడు ఎస్. పి . బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అని. కావున స్వర్గీయులైన ఆ మహానుభావుని తలుచు కుంటూ వారిని స్మరించుకుంటూ వారు అన్నమయ్య చిత్రంలో పాడిన ఈ కృతిని వారికే అంకితం ఇస్తూ ఇదే మా అశ్రు నివాళి ! చిత్రం: అన్నమయ్య (1997) సంగీతం: ఎం. ఎం. కీరవాణి రచన: అన్నమాచార్యల వారు...