Telugu Padam- Antharyaami (1)

 తెలుగు పదం (1)

అంతర్యామి అలసితి 

తెలుగు పదమ అన్న ఈ ధారావాహిక పూనుకున్నాక ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి అన్నది పెద్ద సమస్య నాకు. కానీ ఎప్పటినుంచో ఇలాంటిది ఏదైనా చేస్తే ఆ మహానుభావుడు నాకు ఎంతో ప్రీతిపాత్రమైన మనిషిలో దైవ రూపం - అన్నమాచర్య కీర్తనలతోనే మొదలు పెట్టాలి అన్నది ఒక వాంఛ. కావున ఈ మొట్ట మొదటి సంచిక ఆ మహానుభావుని పేరిట ఆయన ఎంతో భావోద్వేగంతో రాసిన "అంతర్యామి అలసితి " అన్న కీర్తన తో మొదలు పెడ్తున్నాం. అంతర్యామి అంటే ఇంతటి తో సమాప్తం అని కాదు ఇక్కడ్నుంచే అసలు కథ మొదలు గమనించగలరు!! 






ఐతే ఈ సంచిక కొనసాగించే ముందు ఒక చిన్న కొసమెరుపు: ఇటీవలే సంగీతాన్ని ఏలిన రారాజు అమృతం తాగారేమో అన్నంత తీయంగా ఉండే ఆ గళం మూగబోయింది మన భూలోకం విడిచి ఆ కైలాసం చేరుకున్నది - మీకు తెలుసు నేను ఎవరి గూర్చి చెప్తున్నానో- ఆ మహానుభావుడు ఎస్. పి . బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అని. కావున స్వర్గీయులైన ఆ మహానుభావుని తలుచు కుంటూ వారిని స్మరించుకుంటూ వారు అన్నమయ్య చిత్రంలో పాడిన ఈ కృతిని వారికే అంకితం ఇస్తూ ఇదే మా అశ్రు నివాళి !

చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి 
రచన: అన్నమాచార్యల వారు 
గానం: ఎస్. పి . బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి . శైలజ 

Movie: Annamayya (1997)
Music: M. M. Keeravani
Lyricist: Annamaacharya
Singers: S. P. Balasubrahmaniyum & S. P. Sailaja

|| 1|| అంతర్యామి అలసితి సొలసితి |
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||

పరమార్ధం: ఆ మహానుభావుడు అన్నమాచర్య పరమోపదిస్తూ రాసిన  కృతి ఇది. ఆయన వెంకటేశ్వరా స్వామీ భక్తుడు అందరికి తెలిసిందే. ఐతే ఆ స్వామిని తన చివరి దశల్లో "స్వామీ నేను బ్రతికిన బ్రతుకు ఇక చాలు నన్ను తీసుకుపో" అంటూ భావోద్వేగంతో రాసిన కృతి ఇది. ఈ కృతిలో మరణానికి మించిన మోక్షం ఇంకొకటి ఉండదు అని అర్ధం అవుతుంది. అంతర్యామి  అనగా "మనలో ఉన్న ఆత్మా" అని  అర్ధం, ప్రతి ఒక్కరికి  ఒక ఆత్మ ఉంది అన్నది అక్షరాలా సత్యం , ఐతే మన హిందూ పురాణం ప్రకారం అంతర్యామి అనగా  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు - ఐతే అన్నమాచార్యుల వారు వారిని ఉద్దేశించి చెబుతున్నారో లేదా తనకు తానె చెబుతున్నారో (తనలోని ఆత్మకి) అన్నది క్షుణ్ణంగా తెలీదు. 

అసలు అర్ధం: "అంతర్యామి (నాలోని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) నేను ఇక అలసి పోయాను , నా జీవితం మోయటం మహా భారముగానున్నది, ఈ లోకపు సంసార బంధనముల చేత అలసిపోయిన శారీరకంగా కృశించిన నా దేహం ఆత్మా నీ వద్దకి వచ్చి నవి నిన్ను శరణు వెడుతున్నవి నీ అండను కల్పించుము, నన్ను రక్షింపుము "  ఇదే తన ఆత్మా తో చెప్పినట్టు ఐతే బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ప్రస్తావన అనవసరం గమనించగలరు. 

Translation: This Krithi is generally written in accordance with the inner soul of Annamaacharya. We cannot precisely tell if he is speaking with his inner soul or with the Trinity Idols (Brahma, Vishnu & Maheshwara). According to the Hindu Puranas- inner soul indirectly means the Trinity idols, it is said that every human has an inner soul which is being controlled by the Trinity idols.So here, this phrase means-" My dearest inner soul incarnated as Brahma, Vishnu & Maheshwara- A'm tired of my life, A'm in pain & sorrow- so A'm pleading you to grant the salutation (moksha), I'll consider death as the prior salutation- nothing can take it's place in granting freedom to any human being"

||2|| కోరిన కోర్కులు కోయని కట్లు |
తీరవు నీవవి తెంచక |
భారపు బగ్గాలు పాప పుణ్యములు |
నేరుపుల బోనీవు నీవు వద్దనక ||

పరమార్ధం: ఈ జీవితానా మానవ పుట్టాక అన్నది మహోన్నతం అటువంటి జననానా కోరికలు ఆశలు బాసలు అన్నవి చింతించ్చు విశ్లేషణలు. అటువంటి కోరికలు కల్గించిన ఆ వెంకయ్య  మహిమ గొప్పదా లేదా మానవ జననం అందుకున్న మానవుడు గొప్పవాడా అంటే ముమ్మాటికీ మనను తోలు బొమ్మల ఆటలు ఆడిస్తున్న ఆ భగవంతుడేదే పయచెయ్యి . ఈ మానవ జీవితాన పాపా పుణ్యముల మధ్య నడిచేది జీవితం, అటువంటి జీవితం నుంచి మోక్షం కల్పించామని ఆ వేంకటేశ్వరుడిని వేడుకొనడమే ఈ పంక్తి యొక్క పరమార్ధం. 

అసలు  అర్ధం: "స్వామీ కోరికలు అన్నవి క్షుద్రం , వ్యర్థం , అనర్ధం. అవి నీకు తెలుసు కానీ మాకు తెలిసిన నాడు జననం సమాప్తం. ఆ కోరికలు క్షుద్రం అని నీవు తెలిపే వరకు అవి తెగవు, అవి తీరవు. ఈ జనన మరణాలకు అతీతం నీ లీల, అటువంటి ఈ జీవితం పాప పుణ్యముల లెక్కల మధ్యలో నడుస్తుంది, వాటి నుండి వేరుగా ఏర్పర్చడానికి నీ చెయ్యినీ అందివ్వు." 

Translation: "Oh my dear lord, you knew that a human's desires are transient, until you make us realize this bitter truth- we are going to long for such unwanted desires. So, please give us strength to realize that desires will never make you a perfect human. A human life span is something that happens between virtues & sins, so please help us isolate from such a life cycle (indirectly asking for the moksha)"

||3|| జనుల సంగముల జక్క రోగములు |
విను విడువవు నీవు విడిపించక |
వినయపు దైన్యము విడువని కర్మము |
చనదది నీవిటు శాంతపరచక ||

పరమార్ధం - అసలు అర్ధం : "ఈ లోకాన పొగరు, డబ్బు, లంచం, కులం, మతం అనే రోగం, వ్యామోహం పెరిగినది, అటువంటి  సంసారాజన్య బంధాల నుండి విడిపించి ఆ బ్రహ్మ రాసిన విధి రాతలో తలా మునకలు అయ్యి ఉన్న ఈ మానవ జీవితానికి మోక్షం ప్రసాదించటానికి నీవి మాత్రమే సహాయము చేయగలవు"  

Translation: "This is a world which has been affected by a malady disguised as caste, religion, worldly pleasures & family bonds. This is a life which is already penned by the almighty, we cannot really go against it. So my dear lord, A'm pleading you to grant us freedom (Moksha)!"

||4|| మదిలో చింతలు మైలలు మణుగులు |
వదలవు నీవవి వద్దనక |
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె |
అదన గాచితివి అట్టిట్టనక ||

పరమార్ధం: మదిలో కోరికలు చింతలు మొహాలు వ్యామోహాలు అన్ని ఆయన లీలే, ఆ స్వామీ వారి లీలే ఐతే ఆ లీల కు అతీతంగా వెళ్ళేది ఎవరు అటువంటి లీలలు ఆ స్వామివేనని ఆ స్వామి యే ఆ కోరికలు, మొహాలు చెడ్డవి అని నీకు బుధ్ధిని ప్రసాదించాడు అంటే ఆ లీల గొప్పదా లేదా ఆ లీలను అర్ధం చేసుకున్న మనిషి గొప్పవాడా అంటే చెప్పడం అసాధ్యం. కావున ఈ అన్నమాచర్య ఆ పురుషోత్తముణ్ణి స్వామీ అంటూ వేడుకుంటున్నారు . 

అసలు అర్ధం: " ఈ మానవ బ్రతుకే పాప పుణ్య రేఖల కలహం అటువంటి జననాన ఈ మదిలో కోరికలు, మొహాలు, వ్యామోహాలు క్షుద్రం అది నీకు తెలుసు స్వామీ, ఐతే మాకు ఏనాడు ఆ కోరికల నుంచి విముక్తి కల్పిస్తావో ఆ నాడే మేము పరిశుద్ధం. ఓం నమో వెంకటేశ్వరాయ నమః ! నీవు మమ్ములను ఈ క్షుద్ర కోరికల నుంచి ఈ జీవిత సంశార్జన్యాల  నుండి విడిపించుటకు నీ తపన మాకు తెలుసు, నిన్ను శరణన్న మా కోరికలను పెడచెవ్వున వేయ్యావని మాకు తెలుసు, అందుకే నా అంతరాత్మను ఏలుతున్న రారాజు శ్రీ వెంకటేశ్వరా మహారాజా  ఈ భవబంధాలను తెంచి నీ పాదసేవ చేయుటకై పరితపిస్తున్న ఈ మది మాట ఒకపరి వినుమా !!"

Translation: " As always said, there has been some unwanted desires in the heart of a human, it is natural. But as I keep telling, the day when you make us realize that desires will never matter when think about salutation- that day, that particular day of realization is like the moksha! Oh my dear lord, I knew that you keep a record of everything because you are the one who is in my heart, so you would know everything. Whom would I credit all this too- are you really superior, coz you can have a control of our minds & thoughts or A'm the one superior here, coz I already understood that you knew everything about me, it is really hectic process to explain. So, my dear lord, your waiting for an opportunity to take us away, A'm ready, please bless me with freedom (Salutation)!"

ఆహా కమనీయం కడు రమణీయం ఆయన లీల అన్నట్టు , ఆ స్వామీ లీలలు అద్భుతం అని చెప్పకనే చెప్తూ ఉంటాయి అన్నమాచర్య కీర్తనలు. ఇటు వంటి ఎన్నో కృతుల గూర్చి మనం మాట్లాడుకోవాలి అని అభిలాష. ఐతే ఈ కృతిని చిత్రం కోసం ఇంత అద్భుతంగ ఆలపించిన బాలు గారి గాత్రం చిరస్మరణీయం! బాలు గారు ఎప్పటికి మీ పాటలు మాతోనే ఉంటాయి, మీ గాత్రం మాతోనే ఉంటుంది! మిమల్ని మరువటం అసాధ్యం. బాలు గారికి అశృనయనాలతో నివాళి! అలాగే ఈ చిత్రానికి సంగీతం కూర్చిన కీరవాణి గారిని ఇంత అందంగా ఆ గానగంధర్వునితో పోటీ పది పాడిన ఆ అద్భుతమైన గాయని శైలజ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. 

ఈ తోలి "తెలుగు పదం" సంచిక బాలు గారి గుర్తుగా ఇలాగె మిగిలిపోతుంది. 





Comments

Popular posts from this blog

Game Changer Audio Review- Telugu (2025)

Pushpa 2 Audio Review- Telugu (2024)

Get Well Soon- SPB ji