సుస్వర మహారాణికి అశ్రునివాళి 🙏

ఆకాశం ఏనాటిదో.. ఆ గానం ఆనాటిదీ..
గున్న మావి కొమ్మ మీద ... కోయిలమ్మ కూత ఆమెది...
నరవరుల జగత్తులో .... మకుటంలేని సుస్వరాల మహారాణి ఆమె....
సందేపొద్దుల తోటలో ..... తుమ్మెదల ఝాంకారం ఆ గొంతులో గమకాలది.....
మంచుకురిసే వేళలో ...... సిరిమల్లె మొగ్గ మీన పరిమళం ఆ గాత్ర సౌధం......
ఆ గొంతులో పలికే తారస్థాయికి ....... యద లోయల జిలిబిలి పలుకులు.......
కాశ్మీరు లోయలో కన్నె పిల్లల ఘల్లు ఘల్లులు ........ ఆ కంఠంలోని వొద్దికలు........
గోవుల్లు తెల్లనా అన్నా చిన్నారి పొన్నారి కిట్టయ్య అనినా......... ఆవిడకే చెల్లింది .........
మళ్ళీ మళ్ళీ రాని రోజు .......... ఆ తల్లి గరళ మాధుర్యం ..........
నవ్వింది మల్లే చెండు అంటూ నవ్వుతుంది...
ప్రియతమా తమా అంటూ శృంగారం వెలికించిన..
కొత్తగా రెక్కలు విచ్చి కోయిల కుకు కూలూ కూసినా..
సెంచరీలు కొట్టే వయసులో రాసలీల వేళ పాట పాడినా..
నెమలికి నడకలు నేర్పినా.. లిపి లేని కంటి భాషకు అర్థం తెలిపినా..
మాటరాని మౌన గీతానికి సరిగమలు నేర్పినా...
తుళ్ళి పడ్డ మనస్సుకి ఈల వేసి గోల చేసే అటు  అమలాపురం పాట పాడినా..
ఓ రబ్బీ ఏందెబ్బ అంటూ తీయంగా కులుకులోకించినా..
పదహారేళ్ళ వయసుకి పార హుషార్ పాడినా..
సన్నజాజి పడకలో సరసాలు చాలు అని వారించినా..
ఈ దుర్యోధన దుస్యాసన లోకాన్ని నిప్పుతో కడిగేసినా..
ఉరకలైన గోదారికి తీగనై మల్లెలు పూసినా ..

ఆ జానకికే చెల్లింది ...మా జానకమ్మకే కుదిరింది ..మన జానకి గారికే సాధ్యపడింది ..🙏

అమ్మ ఎన్ని వేల పాటలో ...ఎన్ని హావ భావలో....ఎన్ని రాగలో..ఎంత మాధుర్యమూ..

మళ్ళీ రాలేని లోకానికి వెళ్ళిపోయిన సుస్వర జానకమ్మకి ఇదే మా అశ్రునివాలి... ఎక్కడ ఉన్న ఈ భూలోకాన పాటల పూడటలో రారాణి గానే మిగిలుంటారు అమ్మ ...

జానకమ్మ 🙏🙏🙏








Comments

Popular posts from this blog

Tere Ishq Mein Audio Review- Hindi (2026)

They Call Him OG Audio Review- Telugu (2025)

NTR - The Biopic Audio Review- Telugu (2018)