Stop The Scurry !!

STOP THE SCURRY (పరుగు ఆపుదాం) !!

"STOP THE SCURRY" is a simple essay written in accordance to the pandemic disaster taking the lead of the world- "COVID-19". This essay aims at motivating the people to overcome the distress, stop worrying about the deadly disaster & to develop courage in fighting against the virus. This is my kind of tribute to the brave people who lost their lives fighting against the pandemic disease, to the medical staff & military & governed forces who worked tirelessly for the welfare of people & society.

"ఇది అందరిని తలచి వేసే బాధ , విపత్తు ఐన ముందుకు సాగాలి ఎదురీదాలి" . గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని పట్టి వేధిస్తున్న విషయం, మన అందరికి తరచూ వినిపిస్తున్న నిరసన ధ్వని , మరి తానూ ఎవరో కాదు మన అందరికి  సుపరిచితం ఐన "కోవిడ్ -19" లేదా కరోనా వైరస్ పేరిట ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం అది. ప్రతి ఇంటా ప్రతి నోటా వినిపించిన మాటే, పసి వాడి నుండి పండు ముసలి వరకు వేధించిన అంశమే. ఇలా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను , ప్రజల మనుగడ శైలిని కింది మీదుగా చేసిన ఈ వైరస్ గురించి ఓకే చిన్న కథనం మీ కోసం మన అందరి కోసం. 

"అమ్మ  గర్భాన మొదలైనది ఆ పరుగు, నాటికి నే టి కి తనదే పై చెయ్యి అనుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఆ పరుగు, ఈనాడు నీకో మాట నీకో విన్నపం"
తీయగా తీయగా  తీపి అన్నట్టు నేటికీ ఎదురీతే  జీవన వృత్తిగా , అదుపు లేని మానవుడి తెలివిలా విల విల గల గల చెట్లు పుట్టలు కొమ్మలు నరుక్కుంటూ,  నీకంటూ ఏమి మిగలదు అని తెలుసుకుంటూ ,  నీ అడుగులకు నీవే మడుగులు ఒత్తుకుంటూ , ఇతరుల బాధను పట్టిన పట్టనట్టు ఉంటూ , ప్రేమకు మారు పేరు మోసం అనుకుంటూ,  మానవాళికి అడ్డు కట్ట వేసుకుంటూ, అలుపు లేని అలజడి ల ఎగురుకుంటూ , నింగి నెల గాలి నీవే నీవే అనుకుంటూ , సర్వం దోచుకుంటూ , ప్రపంచాన్ని చిన్నబిన్నం చేసుకుంటూ , భూమిపై వనరులను అంతం చేసుకుంటూ  ఇన్నాళ్లు నీవే నీకు సాటి అంటూ ముందుకు దూసుకుపోతున్న ఓ పరుగు నేడు నువ్వు ఆగవలసిన సమయం , మానవులంతా నీకు విన్నవిస్తున్న సమయం, "పరుగు  ఆపుదాం" అంటూ ఉమ్మడిగా నీతో నినదిస్తున్న సమయం. ఈ సమయం తరువాయి రాబోవు తరాలకు నేడు చిత్ర విచిత్రంగ మనుగడ సాగిస్తున్న ఈ మానవాళికి  ఉత్తమం అని భావిస్తున్న ఈ గుండె నీకోసమే ఒక మాటగా పాటగా నివాళిగా నివేదనగా వినిపిస్తున్న సమయం. 

ఆవును చాలానే పరిగెత్తాం, నీల నుంచి నింగి అంచు దాకా , చెట్టు పుట్ట కొమ్మ రెమ్మ నుంచి పేపర్ పెన్సిల్ పెన్ను కుర్చీ దాకా , ప్రేమ నుంచి మోసం దాకా, ఇష్టం నుంచి కష్టం దాటాక , లాలించడం నుంచి పాలించడం దాకా , విశ్వము నుంచి అనంతం దాకా, వాన ధారా నుండి నీటి ధారా దాకా , వేకువ నుండి చీకటి దాకా , కల్మషం నుండి కాలుష్యం దాకా, వేదాల నుంచి వ్యర్ధాల దాకా , హద్దు నుంచి అడ్డు దాకా, అమ్మ నుంచి బొమ్మ  దాకా, అత్త నుంచి బంధం దాకా, స్నేహం నుంచి శత్రుత్వం దాకా, పెళ్లి నుండి విడాకుల దాకా , అంతు నుంచి అంతం దాకా, పుట్టుక నుండి చావు దాకా  అవును చాలానే పరిగెత్తాం. 

ఇక చాలు, మేలుకో ఓ పేరుగా, ఏ పరుగైతే ప్రాణం పోసి ఊపిరి నిలిపిందో ఈరోజు ఆ పరుగే జీవాధారం నుండి జీవనాశనం దాకా తీసుకొచ్చింది.  కావున ఓ పేరుగా, ఈవేళ నుండి నీకు విశ్రాంతి,  మా నుండి విముక్తి. అభివృద్ధికి నింగే హద్దు నీ పరుగుకు రాకూడదు పొద్దు అని ప్రతి మానవుడు చేతులు జోడించే రోజుఇది.  ఈ రోజు మళ్ళి  రాకూడదు, ఈ వేళ  మళ్ళి  తొంగిచూడకూడదు, ఈ విపత్తు ప్రపంచాన్ని అంతం చెయ్యకూడదు ఇదే ప్రతి యెద లయలో వేదన . కావున ఓ పేరుగా ఆ గుండె సడి ఆడడానికి , ఈ ఊపిరి ఉండడానికీ , ఈ చల్లని గాలి వియ్యడానికి , ఆ నీటి సడి అలా అలల వొళ్ళో ఒదగడానికి , కొమ్మల్లో ఆ కోకిల కూయడానికి , మళ్ళి  తూరుపు వెలుగు చూడడానికి , చందమామ తో కబుర్లు చెప్పడానికి, అమ్మ నోటి ముద్దా మింగడానికి, ప్రాణం నిలవడానికి, మనుగడ సాగడానికి, నాగరికత చెరిగిపోకుండా ఉండడానికి నీవు  ఓ రవ్వ అంత ఆగాలి ఆగి తీరాలి. 

నేను నేను నేను మాత్రమే అన్న భావానికి అడ్డు తెర వెయ్యటానికి ఐన , కోపం శాంతం ఒకేలా ఉంటయీ అని అనుకుంటున్నా ఈ యద్భావం తద్భావం కాకుండా మిగలాటానికి ఐన, జంతు జాతి సంరక్షణ కొరకైనా, పాప భారం పెరిగిపోకుండా ఉండడానికి ఐన, రేయి పగలు తొలగిపోకుండా ఉండాలని ఐన ఓ పేరుగా నీ పరుగు ఆపాలి. 

నీకు సదా సేవకులై నీ ప్రాణం తన ప్రాణం ఒకటని భావించి నీ కొరకు పోరాడుతున్న ఆ వ్యవస్థను అభినందించుటకై ఒక సారి పరుగు ఆపుదాం, కలలోని కళలు కలలా మిగిల్చ కుండా ముందు పొయ్యేటందుకు ఒక క్షణం ఆగుదాం, కాలం సాగదేమో అన్న భయం తో ఆగుదాం, ఈ విపత్తు ని ఎదురుకొనే  పౌరుషాన్ని ధైర్యాన్ని పోగు చేయుటకై ఆగుదాం, సర్వం మిగలాలి ప్రపంచం మళ్ళి ముందు సాగాలి అని వెడుతూ ఆగుదాం, బాధ్యతతో ఆగుదాం. పరుగు ఆపుదాం ప్రాణాల్ని కాపాడుకుందాం, పరుగు ఆపుదాం!! ఓ మానవుడా పరుగు ఆపుదాం!!































































































Comments

Popular posts from this blog

Game Changer Audio Review- Telugu (2025)

Pushpa 2 Audio Review- Telugu (2024)

Get Well Soon- SPB ji