Telugu Padam- Aakasam Yenaatido (3)

 తెలుగు పదం (3)

ఆకాశం ఏనాటిదో 

వీక్షించే ప్రతిఒక్కరికి, తెలుగు పదాన్ని ఇష్ట పడే ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు తెలుగు పాదంలో మూడో సంచిక "ఆకాశం ఏనాటిదో" పాట తో ముందుకు తీసుకుపోదాం. ఇక నేరుగా సంచికలోనికి. 

చిత్రం: నిరీక్షణ (1982)
సంగీతం: ఇళయరాజా 
రచన: ఆత్రేయ 
గానం: ఎస్. జానకి 








Movie: Nireekshna (1982)
Music: Ilaiyaraaja
Lyricist: Athreya
Vocals: S. Janaki


ఎన్నో సార్లు ఎన్నో ధారావాహికల్లో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంటూనే వచ్చాను. ఎందుకు ఇష్టం అంటే చెప్పలేను ఎంత ఇష్టం అంటే చూపించలేను. ఈ పాట ఒక త్రిమూర్తుల కలయిక - ఆత్రేయ, ఇళయరాజా, జానకి సృష్టించిన అద్భుతం, అంటే అందంగా బాలు మహేందర్ గారి చే చిత్రంప బడిన పాట కూడా. ఐతే ఈ పాటా ముందుగా "ఓలంగళ్ "Listen Here- Malayalam Version అనే మలయాళం చిత్రం కోసం రాజా గారు 1981 లోనే సంగీతం చేకూర్చారు, ఆ చిత్రం కూడా బాలు మహేందర్ గారి చేనే దర్శింపబడినది, జానకి గారే మలయాళం లో కూడ పాడారు. ఎంత అనువాదం అనుకున్న, ఈ పాటలో ఉన్న తెలుగుదనం చూస్తే అసలు తెలుగు లోనే మొదట చేశారేమో అని భ్రమించే అంతే గొప్పగా రాసారు ఆత్రేయ గారు. ఐతే ఆ మహమూర్తులను స్మరించుకుంటూ వాయులీనం అయ్యిన ఆ ఆత్రేయ గారి ఆత్మకు ఈ పాటను అంకితం ఇస్తూ ఈ సంచిక :

పల్లవి:

|| ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది |  - 2
 ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది | -2
 ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది || -2

కొసమెరుపు: ఈ చిత్రంలో అర్చన (నటీమణి) ఒక పల్లె జాతికి చెందిన వేషం పోషిస్తోంది. ఆ గిరిజన జాతులవారి మనసులు అమాయకం అని తెలియచెప్పడం ఈ పాట సారాంశం. అంతే అద్భుతంగ ఉంటుంది ఆ సంగీతం, ఆవిడ గానం, అయన రచనం. 

అసలు అర్ధం: ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి- ఇవి పంచభూతాలు, వాటి పుట్టుపూర్వోతరాలు ఎవరికీ ఎరుక, కావున ఆ ఆకాశం ఎప్పుడు నుంచి ఈ లోకాన ఉన్నదో ఆ నాటి నుండే ప్రేమ అన్న భావన కూడా ఉన్నది. కానీ మంకు ఆవేశం ఏనాడు మనసున చిగురించినదో ఆనాడే ఆ ప్రేమకు అసలు మూలం తెలిసినది. 

Translation: The five elements- sky, water, air, fire & earth- we never knew when they began to exist. But when human life came into existence we began to understand that they have been a part of this world, even before there existed an atom (Deeply meaning that they all are age old). So, the writer says "from the day when sky existed, from then itself the feeling of love too existed, but the day when humans began to experience anger- they then realized the fact that love is as old as sky"!!

ఆచార్య ఆత్రేయ 

చరణం 1:

|| ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది 
   ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దొరాసున్నది | 
   బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా 
   మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా 
   పరువాలే ప్రణయాలై 
   స్వప్నాలే స్వర్గాలై 
   ఎన్నెనో శృంగార కన్నుల్లో రంగేళి అలగెను || 

అసలు అర్ధం: ఏ పువ్వు పైన ఏ తుమ్మెద వాలునో ఆ పువ్వు ఆ తుమ్మెదదేనని ఏనాడో ఆ దేవుడు రాసేసాడు. ఏ పెదవి ఏ మోముని ఏ పొద్దు ముద్దాడునో అని  కూడా ఆ దేవుడే రాసాడు. బంధాలను కలుపుకుంటూ పోయే ఈ వయసుకు ఆ అందాలే దాసోహమయినాయి. ఏ పెదవి ఏ మోముని ముద్దాడుతున్నాయో ఆ పెదవులు మందారంలా పూసి ఆ పువ్వుల్లో తెనలను ఆ మోముని ఆ ముద్దుతో చవిచూడ మని అడుగువేల పరువాలు ప్రాణ్యాలు అయినాయి కలలు స్వర్గాలయినాయి, ఆ కళను చూస్తున్న ఈ కన్నుల్లో ఎన్నెనో శృంగార దృశ్యాలు తళుక్కుమన్నవి "

Translation: Generally a bee's trait is to suck nectar from a flower, so it is already decided by the almighty that about which flower's nectar should be sucked by which bee!! The same almighty has decided about which person is going to experience the kiss of his/her loved ones. This age has got a attire of acting as a catalyst in enhancing all the bonds with the loved ones. When the lips are about to kiss they turn into a hibiscus flower & start yielding nectar & when the one who is about to kiss is asking him/her to suck the nectar from the lips, then at that moment my dreams have become trances and unknowingly many sensuous thoughts have struck my eyes. 

చరణం 2:

|| ఏ మేఘం ఏ వాన చినుకై మొలకెత్తునో 
  ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో 
  హృదయాలు తెరతీసి తనువులు కలబోసి మరిపించమనగా 
  కౌగిలిలో చేరవేసి మాధనుని కరిగించి గెలిపించమనగా 
  మొహాలీ దాహాలై 
  సరసాలు సరదాలై 
  కాలాన్నే నిలవేసి కాలాలకు ఇవ్వాలి వెలలేని విలువలు || 

కొసమెరుపు: నాకు తెలిసి ఈ చివరి చరణం ఆ కింద  పల్లవి, ఆలాపన అన్ని కూడా జానకమ్మ ఒక్క దమ్ములో పాడేసిఉంటారు. ఆవిడ ఊపిరి స్థానం ఈ దేశంలోనే ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. ఎన్ని సార్లు విన్న కూడా అసలు ఆలా ఎలా పాడారో అర్ధం కానీ నెపంతో పాడారు ఆవిడ. ఎన్ని సార్లు చెప్పిన తక్కువే ఈ పాట గూర్చి ఆవిడ స్వరం గూర్చి. రాజా గారికి కూడా ఎంతో ఇష్టమైన పాట ఇది , ఇంత అద్భుతంగ పాడగలిగిన గాయని ఉంటె ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు ఈ పాట అంటే !!
జానకి 
అసలు అర్ధం: ఒక మేఘం నీటి మూటను తనతో తీసుకొచ్చి సాగుచేస్తున్న భూమి పైన ఆ నీటిని వర్షంగా వర్షిస్తేనే మొక్క మొలకెత్తుతుంది, కావున ఏ మేఘం ఏ నీటి బొట్టుదో ఆ నీటి బొట్టు ఏ విత్తనందో ఆ దేవుడు ముందే రాసాడు. ఏ రాగం ఏ మనసులో ఏ గీతం పాడిస్తుందో కూడా ఆ దేవుడే రాసాడు. ఆ దేవుడే ఈ హృదయంలో ఉన్న ప్రేమకు తెరతీసి ఆ మనసులో లీనమై ఆ ప్రేమికుడి తనువుతో కలిసి ఏకమవ్వాలి. కౌగిలిలో చేరేహి మాధనుని కరిగించి గెలిపించాలి అనుకున్న ఆ సమయంలో దాహాలై సరసాలు సరదాలై కాలాన్ని నిలిపివేసి కాలాలకు ఇయ్యాలని ఉందట ఎన్నో బహుమతులు వేళా కట్టలేని విలువలు. 

Translation: The almighty has already affixed about which cloud has to carry which rain drop & which rain drop should turn a seed into a seedling. That almighty himself has decided about which surgam is going to bring out which song in someone else's heart. May that almighty bring us together, may my hug give him all the warmth and at that time when A'm hugging him, my thirst has turned into my desire & my sensuous appeal has become a simple lite hearted fun & at that moment let the time stop there istelf & lemme gift that moment with some precious gems. 







Comments

Popular posts from this blog

Game Changer Audio Review- Telugu (2025)

Pushpa 2 Audio Review- Telugu (2024)

Get Well Soon- SPB ji