AAA 11
AAA- 11
Hey Music Fans & Lovers..A'm back!! I know it has been quite long meeting you all! Here we go to fill that space! Always it is the distance of two hearts between you & me, a heart that waits for the last Wednesday of every month & another heart which snaps that void feel with an amazing article! I hope you all have got this. Okay, jokes apart- this month we are talking about the legendary euphonious phenomenal & & & ....I literally don't know how to describe about him- he is our very own Telugu lyricist 'Veturi Sundarama Murthy' Gaaru!
Here, only with this article it is an exception- everything will be written in Telugu. Coz, when we are talking about a pro in Telugu, don't you think we have to give a tribute to him in that language where he reigned like a king!! So, here we go- this is a reminder once again- only for this article it will be in Telugu, next we will revert back to our normal medium!
'వేటూరి సుందరరామమూర్తి' ఈ పేరే తెలుగు భాషకి పరియాయ పదంగా చెప్పుకొచ్చు. ఆ మహామూర్తి గురించి మాట్లాడే అరహతా కానీ అనుభవం కానీ నాకు లేక పోవచ్చు కానీ ఆయన్ని స్మరించుకొనే భాద్యత మాత్రం మన అందరి మీద ఉందని తెలియచేస్తున్నాను.
తెలుగు సాహిత్యానికి మెరుగులు దిద్దిన మహాపురుషులు ఎందరో కానీ తెలుగు సినీ చరిత్రలో పాటలకి ఒక ప్రత్యేక స్థానం దానికంటూ ఒక అరుదైన గౌరవం లభించాయి అంటే దానికి కారణం ముమ్మాటికీ సుందరామమూర్తి గారే అని చెప్పడం అతిశేయోక్తి కానీ కాదు. తెలుగు అక్షరానికి ఒక అరుదైన రూపం దిద్దాలన్న తెలుగు భాషకి కొసమెరుపులు అద్దాలన్నా తెలుగు పదం తో తెలుగు పడతికి స్వరార్చన చేయాలన్నా ఆయనకే చెల్లుతుంది ఏమో.
తెలుగు చిత్ర సీమలో ఎన్నెన్నో అద్భుతమైన సాహిత్యాలు వాటికి ఎంతో అందంగా తీర్చి దిద్దే సాహితీవేత్తలు ఇంకెందరో. అందులో నన్నయ గారి దెగ్గరనుంది మొదలుకొని శ్రీ శ్రీ , దాశరథి, పింగళి, తిక్కన్న, ఎర్రాప్రగడ, బమ్మెర పోతన, వేమన, అన్నమాచర్య, త్యాగయ్య, అల్లసాని, కృష్ణ రాయల వారి దెగ్గర వరకు వచ్చి అటు పైన ఆరుద్ర, ఆత్రేయ, సముద్రాల, వీరేశలింగం, రసరాజు సాహిత్యాలను అవపోషణ పట్టి అటు ముందు ఒక ఉప్పెన ఒక పెను సంచలనం ఆ పేరు వేటూరి సుందరంగా మూర్తి , పైన పేర్కొన్న వారిని తక్కువ చేసి రాసేంత గొప్ప వ్యక్తి ని కాను అని ఇది ముందే పేర్కొన్నాను ..కానీ వీరి అందరికన్నా బిన్నంగా ఎదో కొత్త ఉత్సాహాన్ని అందించింది మాత్రం వేటూరి గారే. ఆ తరువాత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ గారు తెలుగు సాహిత్యాన్నీ మరువలేని స్థానాన్ని అధిరోహింపచేసిన వేటూరి గారి ముద్ర చేరగా లేనిది.
ఇక వేటూరి గారి గూర్చి - ఆయన పూర్వం ఆంధ్ర దేశాన 1936 లో పెదకళ్లేపల్లి లో కృష్ణ జిల్లాలో అచ్చమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వేటూరి గారు దివిసీమలో పాఠాలు నేర్చుకొని చెన్నై పట్టణాన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని మళ్ళీ విజయవాడన డిగ్రీ పట్టభద్రులు అయ్యారు . వేటూరి గారు కొన్ని సంవత్సరాలు విలేఖరు ఉద్యోగం కూడా చేసారు. ఆంధ్రప్రభలో 1952 లో వార్తాపత్రికల సంపాదకునిగా పనిచేశారు. ఐతే వారికి సినీ పరిశ్రమలో దాశరథి గారి వంటి మహామహులతో చిరు పరిచేయం ఉండబట్టి ఆయన ఈ రంగంలోనికి అడుగుపెట్టారు. దాశరథి, నాగయ్య ల ప్రోత్సాహంతో 'నా ఇల్లు' అనే చిత్రంలో ఒక చిన్న పాత్ర ఒప్పుకున్నారు, కానీ చిత్రీకరణ మొదలయ్యే 2 రోజుల ముందు నాగయ్య వారికి క్షమాపణ లేఖ రాసి నటనకి నేను పనికిరాని అని నిర్ణయంచుకున్నారు . ఐతే తదుపరి నటసార్వభౌమ నందమూరి తారక రామారావువు గారి ప్రోత్సాహంతో అగ్ర కవుల స్థానంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నారు.
ఒక కొంటె పాటకైనా, చింత పాటకైనా, శోక రసమైన, హాస్యమైన,వ్యంగ్యము ఐన, రౌద్రమై యే రసమైన యే రకం ఐన వేటూరి గారు రాయలేని పాటంటు లేదు. వారి శైలి చిరస్మరణీయం వారి రచన అమోఘం వారి పాట పంచామృతం వారి కలం కాలానికే పాఠం !! అటువంటి గొప్ప వ్యక్తి గురించి కొరకు ఈ నా చిన్ని నివాళి స్మరణ !!
" వేటూరిగారి నవరత్నాలు " - వారు రాసిన 9 పాటలతో వారికి ఈ శీర్షిక అంకితం !! తెలుగు వారు ఎన్నటికైనా మీ ఋణం తీర్చుకోలేదు ! మీ గూర్చి ఎంత చెప్పిన తక్కువే !
01. శంకర నాదశరీరపర
చిత్రం: శంకరాభరణం - 1979
సంగీతం: కే. వి. మహదేవన్
గానం: ఎస్. పి . బాలసుబ్రహ్మణ్యమ్
'శంకరాభరణం' చిత్రం ఒక సంచలనం - అది విశ్వనాథుల వారి కళాకాండం అందులో సోమయాజులు వారి నటనా ప్రావిణ్యం ప్రదర్శించిన చిత్రం అని కూడా పేర్కొనొచ్చు . ఇందులో మహదేవన్ గారి సంగీతం ఆయువుపట్టు ఐతే బాలు గారు వాణి అమ్మ జానకి గార్లు ఊపిరితిత్తులు ఐతే వేటూరి గారు అన్నింటికంటే ప్రధానం ఆ ఆయువిని వాడకాచే దేహం చిత్రానికి ఆభరణం. అంతటి కళాకాండం లో ఈ పాట నేటికీ నాటికి చిరస్మరణీయమే. బాలు గారి పాట అమృతం అది నఘ్న సత్యము ఐతే వేటూరి గారి కలం ఆ స్వరంతో పోటీపడుతూనే ఉంటుంది ఈ పాటలో, ఎవరు గొప్ప అని చెప్పడం ఎవరి తరంకాదు , కేవలం పాట విని దానికి శ్రోతలు వీనులవిందు చేసుకోడమే తప్ప ఇంకే అవకాశం మనకి మిగల్చలేదు ఆ మహామహులు. ఈ పాటలో ప్రతి పదం అజరామరామె. విశ్వనాథుల వారి దర్శకత్వం ఒక ఎత్తు సోమయాజులు వారి నటన ఒక మెరుపు బాలు గారి గళం కొసమెరుపు వేటూరి గారి పదం అన్నింటికీ ఆయువుపట్టు. ఇంతకంటే చెప్పడానికి నాకున్న అరహతా చాలదు కావున పాట విని ఆస్వాదించండి.
02. యమహా నగరి
చిత్రం: చూడాలని ఉంది - 1998
సంగీతం: మణిశర్మ
గానం: హరిహరణ్
" వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా
కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను
శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో "
కలకత్తా గురించి ఒక తెలుగు పాట ఒక తెలుగు నోట ఇదే మొదటిది కాబోలు. బెంగాల్ వాళ్ళ గూర్చి ఇంత క్షుణంగా రాయగలిగినది వీరే కావొచ్చు. పైన రాసిన చరణాన్ని చదవండి - "ఓహో ఇదే కావొచ్చు కొలకత్తా గొప్పతనం" అని మనం అనుకోకపోతే అది పాటే కాదు మనది గుండె కాదు! బంకిం చంద్ర ఛటర్జీ గారి వందే మాత్రం స్ఫూర్తిని గుర్తుచేస్తూనే మాతంగి మాత మతం ప్రస్తావన తెస్తూనే చొరంగి రంగుల కోలాహలం చూపుతూనే సత్యజిత్రే, ఎస్. డి. బర్మన్, మదర్ థెరిసా వంటి వారి సేవలను కొనియాడుతూనే జాతి గర్వించే జాతీయ గీతం స్వర పరిచిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మార్గం చెప్పకనే చెప్తూ దేశభక్తి చాటుతూ ఇదంతా కొలకత్తా మహత్యం అని ఒక చరణంలో చెప్పారు వేటూరి గారు. ఇంతకన్నా గొప్పగా కొలకత్తా కవులు కూడా వారి దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తి ఉండరు , అంత వేటూరి గారి చాతుర్యం. హరిహరణ్ గారి తేన గళంలో జాలువారిన ఈ మణిశర్మ స్వరం చిరంజీవి గారి ప్రముఖ పాట ఈ కలకత్తా పూరి గీతం వేటూరి పద జాలం!!
03. చందమామ కంచవెట్టి
చిత్రం: రాంబంటు- 1996
సంగీతం: ఎం . ఎం. కీరవాణి
గానం: కే. ఎస్. చిత్ర, ఎస్. పి . బాలసుబ్రహ్మణ్యమ్
వేటూరి గారు ఎన్నో శృంగార పాటలు కొంటె పాటలు రాసివుండొచ్చు కానీ ఈ పాట వారు రాసిన మహా కొంటె పాట అంటారు సాహితీ విలువలు తెలిసిన కొందరు . మరియు ఇన్ని ప్రయోగాలు చేసిన కవులలో వేటూరి గారిదే ప్రధమ స్థానం . "పంచదార చిలకడు , అవకతవకడు , ముదురు బెండడు " నమస్కారం వేటూరి గారు, అసలు ఇంతకన్నా కొంటెగా ఎవరన్నా ఆలోచించగలరా? కీరవాణి గారు వేటూరి గారి ప్రియశిషులు అని చాలా సార్లు వారే పేర్కొన్నారు, అందుకే కావున కీరవాణి గారి సాహిత్యం అప్పుడప్పుడు వేటూరి గారిని గుర్తుచేస్తుంది! వారి ఇరువురి కలయిక కూడా తెలుగు సినీ ప్రపంచంలో ఒక వినూత్న మార్పు , వీరి కలయిక కూడా ఎన్నో అజరామరమైన పాటలు రూపొందించింది. ఈ పాటలో ప్రతి మాట ఒక గునపం లాంటిదే, ఆలా సందర్భానికి తగట్టు ఈశ్వరి గారి కళ్ళు నటన, బాపు గారి దర్శకత్వం, కీరవాణి గారి బాణీ పోటీ పడుతూ వినిపించి కనిపిస్తాయి ఈ పాటలో. వేటూరి గారు ఎంత కొంటెగా రాసారో ఈ పాట చిత్ర గారు అంత కంటే అద్భుతంగ పాడారు. మొత్తం మీద ఈ పాట మేము వినలేదు అంటారా? పరవాలేదు ఇప్పుడు వినండి మైమరచిపోండి!
04. ఆకాశ దేశాన
చిత్రం: మేఘసందేశం- 1983
సంగీతం: రమేష్ నాయుడు
గానం: కే. జె. ఏసుదాస్
ఈ పాట వింటుంటే ఎదో తెలియని తీయని భాధ మనని పలకరిస్తూనే ఉంటుంది ఏమో అది వేటూరి గారి పదమో ఏసుదాస్ గారి స్వరమో చెప్పటం కష్టం. ఏ. యెన్. ఆర్ గారి నటన మరువలేనిది దాసరి గారి దర్శకత్వం మరుగవ్వలేనిది వీటి అన్నింటికీ ఒకటే మూలం ఈ పాట ఈ చిత్రం, అందులో వేటూరి గారి ఈ పాట పథక సన్నివేశాన్ని ఇంకా పెంపొందించింది అనటంలో అతిశోయక్తి లేనేలేదు. సర్వదా కృతఙన్యులం మీకు వేటూరి గారు !
05. మధుర మధుర మీనాక్షి
చిత్రం: అర్జున్- 2004
సంగీతం: మణిశర్మ
గానం: హరిణి, ఉన్నికృష్ణణ్
కొన్ని పాటలు ఏ సంద్రాభంలో వచ్చాయి అని కాదు కానీ ఆలా చిరస్థాయిలో నిలిచి పోతాయి అంతే. ఆలా మొదటి వరుసలో ఉంటుంది ఈ పాట. మణిశర్మ సంగీతం ఎప్పటికి అదే మాధుర్యాన్ని తలపిస్తుంది వేటూరి గారి పదం అంతే తెలుగు తనాన్ని వినిపిస్తుంది. " తెలుగు తమిళం ఏనాడో జత కట్టెను ఈ మీనాక్షి" అలాగే వేటూరి గారి పాట మన తెలుగు నాట అన్న పదానికి కూడా జత కట్టినదేమో ఆ మీనాక్షి !!
ఈ పాటలో - "వరములా చిలక స్వరముల చిలక కరముల చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా " అంటూ 6 సార్లు చిలక అన్న పదం వాడతారు మూర్తి గారు ఐతే ఆ చిలక అన్న ప్రతి సారి ఒక అర్థమొచ్చేట్టు చూసుకున్నారు వారు!! ఇంతకన్నా ప్రజ్ఞశాలి ని ఎక్కడ చూసి ఎరిగివుండాము మనము. ఈ పాట నాకు ఎంతో ఇష్టం, మహేష్ బాబు చాలా అద్భుతంగ నటించిన ఈ చిత్రం ఈ పాటతో అసలు కథకి చేరుకుంటుంది మనని ఆ స్వరమాయాజాలంలో బంధించేస్తుంది. ఉన్నికృష్ణణ్ గాత్రం అంటే ఇష్ట పాడనీ వాళ్ళు ఉండరు , ఆ తేనే గళం హరిణి గాత్రం కళకలిపి వేటూరి గారి కళాపోషణ లా కనిపిస్తుంది ఈ పాట !!
06. ఈ దుర్యోధన దుశ్యాసన
చిత్రం: ప్రతిఘటన- 1986
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్. జానకి
"ఈ పచ్చవిక చరణంలో మూగబోయిన పల్లవిలో ఈ ఆటవికులు రాజ్యంలో అబలలు దుర్మరణాలు ..ఈ చరిత రాయాలి ఎవరో ఒకరు తిరగరాయాలి" అంటూ ఒక కవి విలపిస్తే..అందుకు నేనున్నాను ఈ జాతిని మేలుకొల్పటానికి ఈ గాడి తప్పిన బండిని సరి దారిన నడపటానికి ఈ దుర్యోధన దుశ్యాసన లోకాన్ని బాగుచేయటానికి నేనున్నాను అంటూ రాసారేమో వేటూరి గారు ఆనాడు ఈ పాట!! ఎప్పుడో 1986 లో రాసిన పాట నేటికీ పాడబడుతోంది నేటికిహర్షించబడుతోంది అంటే సిగ్గు చేటు అనే చెప్పాలి. ఎందుకంటే వారు రాసిన ఆ పదం మనకి అర్ధం కాలేదు కాబోలు అందుకే ఇంకా తెలుగు రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనిపిస్తూఉంటుంది. అది పక్కన పెడితే ఒక జాతిని ఇంతలా మేలుకొల్పి ముందుకు నడిపించే స్ఫూర్తి ఒక పాట రూపేన తీసుకురావటం అంటే సహజమైన విష్యం కాదు!! ఆ ప్రశంస వేటూరి గారికే!! ఈ పాట వినని తెలుగు వారు ఉండరు అంతటి ప్రాముఖ్యతను సంపాదించింది ఈ పాట, ఇందులో ప్రతి మాట మనం విని నేర్చుకోవల్సినవే!! ఇంకా ఈ పాట గూర్చి చెప్పే అరహతా నాకు లేదు, అంత మహొనత్తంగా రాయబడిన పాట ఇది. ఐతే ఈ పాటలో జానకి గారు కనపరిచిన భావం అనితరసాధ్యం కేవలం ఆవిడ మాత్రమే పాడగలిగిన పాట ఇది !!
07. శ్రీ రామ్ జయరాం
చిత్రం: లవ కుశ - ది వారియర్ ట్విన్స్ - 2010
సంగీతం: ఎల్. వైద్యనాథన్
గానం: కే. జె. ఏసుదాస్, విజయ్ ఏసుదాస్
ఇది బహుశా వేటూరి గారు రాసిన చివరి పాట కోవొచ్చు. చాలా మంది "బస్సు స్టాప్" అనే చిత్రంలో వారు చివరి సేవలు అందించారు అనుకుంటునారు కానీ వారు ఈ చిత్రంలో ఆఖరిగా పనిచేసింది . ఇది ఒక ఆనిమేటెడ్ ధారావాహిక ,ఐతే దీనికి ఆ రాముని గాథ నేటి పిల్లలకి అందివ్వాలి అన్న తపనతో రూపొందిన చిత్రం. వైద్యనాథన్ గారి చివరి చిత్రం కూడా ఇదే. ఇందులో ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు వేటూరి గారు. ఆ రాముని గూర్చి రాయాలంటే ఒక అర్హత ఉండాలిగా కావున వేటూరి గారు రాసారు ఈ పాటలు. విజయ్ ఏసుదాస్ మరియు ఏసుదాస్ గారి మధుర స్వరాలాపన లోనుండి జాలువారిన ఆణిముత్యం ఈ పాట. వినని వారు విని ఆస్వాదించండి.
08. ఓహ్ ప్రేమ నా ప్రేమ
చిత్రం: చంటి- 1991
సంగీతం: ఇళయరాజా
గానం: కే. ఎస్. చిత్ర
విరహ వేదనలో ఉన్నప్పుడు ఇలాంటి పాటలే పుడతాయి ఏమో !! ఇళయరాజా- వేటూరి- చిత్ర మరిచిపోలేని జ్ఞ్యాపకం. వీరి కలయిక ఎంత అద్భుతమో చెప్పటానికి వీలు లేదు!! ఎన్ని అమోఘమైన పాటలు సృష్టించాయో కూడా చెప్పే అంతులేదు !! "రక్తంలోని సుడి గుండం రాయాయ్యి పోయే అనుబంధం" ఈ ఒక్క వాక్యం చాలు వేటూరి గారి ప్రావీణ్యాన్ని చూపడానికి. ఎందుకో తెలీదు ఈ పాట అంటే నాకు చెప్పలేని ఇష్టం. చిత్ర గారి మధుర స్వరం ఎప్పటికి తీపి , ఇలాంటి పాటలు ఎంత గొప్పగా పాడ్తారో ఆవిడ!!
09. వేణువై వచ్చాను
చిత్రం: మాతృదేవోభవ- 1993
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: కే. ఎస్. చిత్ర
ఈ పాట వేటూరి గారి గీతం! వాయులీనం అన్న పదాన్ని అయ్యనకే అంకితం చేద్దాం ఈ పాత ద్వారా. ఈ పాట లో ఉన్న వైవిధ్యాన్ని వర్ణించే అంత వయసు అనుభవం రెండు లేవు నాకు!! కీరవాణి -చిత్రాల కలయికలో ఇది ఒక మైలురాయి. దానికి వేటూరి పదం అంతరభావం. రాయి అయ్యిపోయిన అహల్య రాముని స్పర్శతో మనిషవుతుంది, అటు వంటి రామ పాదస్పర్శ లేకనేటికి రాయినయ్యి ఉన్నాను అంటూ ఆయన రాసిన పదానికి హరి హరి అంటూ చిత్ర గారు బాధతో ఆలపించే ఆ ఈ పాట వింటే గుండె తరుక్కుపోతుంది కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇలాంటి పాటలు రాయాలంటే వేటూరి గారే రాస్తారేమో, ఇంకెవరున్నా ఐతే అంత బలం చేకూర్చలేరేమో!! కీరవాణి గారి స్వరానికి ఎన్ని ప్రశంసలు కురిపించిన తక్కువే !! ఈ పాట ఎన్నో వేదికల పైన ఎందరో గాయకులూ ఈ పాటని పాడిఉండొచ్చు కానీ ఈరోజుకి కూడా ఈ పాట చిత్ర గారు పాడితెనె అందం, ఎం మాయ చేస్తారో తెలీదు ఎం మందు ఉందొ తెలీదు ఆ గాత్రంలో శ్రోతల్ని ఆలా కట్టి పడేస్తారు ఆవిడ గానం తో. ఒక పాటకి వందకి వంద శాతం న్యాయం చేయగలిగిన గాయకుల లో చిత్ర గారే ఆఖరు ఏమో ఎందుకంటే ఆవిడ తరువాత అటు వంటి గాయని ఇంకా పుట్టలేదు పుట్టరేమో కూడా!! ఐతే ఈ పాత గూర్చి మాట్లాడే అరహతా లేదు అన్నాను కాబట్టి ఇంకా ఎం మాట్లాడాను!!
ఇది ఆ మహానుభావునికి మేము ఇచ్చే నివాళి లాంటిది!! తెలుగు భాష ఉన్నన్నాళ్ళు వేటూరి గారు గుర్తుంటారు!! 🙏
Comments